వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస రెడ్డిని తాళ్లూరు మండల సచివాలయాల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి గురువారం ఒంగోలులో కలసి సన్మానించారు. పార్టీలో తనను జెసీఎస్ కన్వినర్ గా నియమించటానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి ప్రతి నాయకుడిని కలుపుకుని, గ్రామ స్థాయిలో బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చెయ్యాలని యాడికకు రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ నమ్మకాన్ని నిలుపుకుంటానని చెప్పారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రీజనల్ కోఆర్డినేటర్ బాలినేనిని సన్మానించిన జెసీఎస్ కన్వినర్ యాడిక
23
Feb