వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవి భద్రారెడ్డిని సన్మానించిన జెసీఎస్ కన్వినర్ యాడిక

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వైఎస్సార్సీపీ నాయకుడు వై. వి భద్రా రెడ్డిని తాళ్లూరు మండల సచివాలయాల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఒంగోలులో కలసి సన్మానించారు. పార్టీలో తనను జెసీఎస్ కన్వినర్
నియమించటానికి సహకరించినందుకు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, భద్రారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి ప్రతి నాయకుడిని కలుపుకుని, గ్రామ స్థాయిలో బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చెయ్యాలని యాడికకు వై. వి సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ నమ్మకాన్ని నిలుపుకుంటానని చెప్పారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *