పురాతన వినాయక స్వామి విగ్రహం దొంగలు గుర్తింపు – బంగారం, వజ్రాలు పురాతన విగ్రహాలలో ఉంటాయన్న దురాశతో విగ్రహం ద్వంసం- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు – దురాశతో మోసపోవద్దని డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హితవు – విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన దర్శి డీఎస్సీ – త్వరిత గతిన కేసును ఛేదించిన ఎస్సై ప్రేమ్ కుమార్, సిబ్బందికి అభినందించిన దర్శి డీఎస్పీ

పురాతన విగ్రహాలలో బంగారం, వజ్రాలు ఉంటాయన్న దురాశతో పలువురు ముఠాగా ఏర్పడి పురాతన విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేసారు. అందుకు సంబంధించిన వివరాలను తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాళ్లూరు శివాలయంలో పురాతన వినాయక స్వామి రాతి విగ్రహం జనవరి 8న చోరీకి గురికాబడినట్లు పూజారి బెల్లంకొండ సాయి ఫిర్యాదతో కేసు నమోదు చేసిన ఎస్సై ప్రేమకుమార్, దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, దర్శి సీఐ రామకోటయ్యల ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేసారు. పురాతన విగ్రహాలలో బంగారం, వజ్రాలు ఉంటాయని ఆ సంపదతో ఒక్కసారిగా ధనవంతులు కావాలన్న దురాశతో పురాతన విగ్రహాలను దొంగలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ వివరించారు.ముద్దాయిలు ఆరుగురు కాగా అందులో ముండ్లమూరు మండలం కెల్లంపల్లి పంచాయితీ విరాట్ నగర్ కి చెందిన పూరిమిట్ల గోపాల క్రిష్ణ, నందమూరి నగర్ కి చెందిన పూరిమిట్ల వెంకటేశ్వర్లు, కురిచేడు మండలం ధేకన కొండకు చెందిన షేక్ హుస్సేన్, మద్దిపాడు మండలం, ఇన మన మెల్లూరుకు చెందిన కొలంకలూరి సుబ్బయ్య, టంగుటూరు మండలం వల్లూరు గ్రామానికి చెందిన వల్లూరి ఆంజనేయులు, మద్దిపాడు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ బాషలు ఉన్నారు. ముద్దాయిలు జనవరి 7వ తేది రాత్రి ఒకటి నుండి రెండు గంటల సమయంలో తాళ్లూరు శివాలయంలో విగ్రహానికి దొంగలించుకుని, బోలేరో వాహనంలో గుండ్లకమ్మ నది ఓడ్డుకు తరలించారు. అనంతరం విగ్రహాన్ని ధ్వసం చేసి చూడగా అందులో ఎటువంటి బంగారం, వజ్రాలు లభించలేదు. దీంతో విగ్రహాన్ని నదిలో నిమర్జనం చేసారు. పోలీసుల విచారణ అనంతరం విగ్రహాన్ని నది ప్రాంతం నుండి బయటకు తీసి యధా విధిగా పేర్చి చూడగా పురాతన విగ్రహం అనవాళ్లు వచ్చాయి. దీంతో ముద్దాయిలను వారు ఉపయోగించిన బోలోరో వాహనం, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తక్షణం స్పందించి సకాలంలో ముద్దాయిలను గుర్తించి వారి అరస్ట్ చేసి, పురాతన విగ్రహాన్ని త్వరగా రికవరీ చేసిన ఎస్సై ప్రేమ్ కుమార్ , కానిస్టేబుల్స్ రాములు, శేషగిరి, విజయ్ ల ను డీఎస్సీ అభినందించారు.
దురాశకు పోయి మోసపోవద్దు…….

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజలు దురాశకు పోయి మోసగాళ్ల చేతిలో మోసపోవద్దని డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి హితవు చెప్పారు. పురాతన విగ్రహాలలో, ఎదైనా రాళ్లల్లో వజ్రాలు, బంగారు నగలు ఉండవు అని హితవు చెప్పారు. గతంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి వారు మోసపోయి ఉంటారని, వారు అదే పనిలో ఇతరుల మాటలు విని ఇలా దురాశకు పోతారని అన్నారు. భూమిలో నిధులు దొరుకుతాయని, పురాతన నివాసాలలో ఉంటాయని ఎవరైనా చెప్పిన మాటలు విని మోసపోవద్దని అన్నారు. బంగారు నాణాలు, బిస్కట్లు దొరికాయని, తక్కువ ధరకు ఇస్తామని కొందరు మాయ మాటలు చెప్పి మోసం చేసే పనిలో ఉంటారని అన్నారు. ఎదైనా ఒకటి అర మంచిది ఇచ్చి మిగిలినవి నకిలీవి ఇచ్చి మోసం చేస్తుంటారని , బంగారు, వజ్రాలు ఎక్కడా తక్కువ ధరకు రావు, అమాయకంగా, దురాశతో మోస పోవద్దని కోరారు. అటువంటి మోసగాళ్ల విషయమై ఎదైనా సమాచారం ఉంటే పోలీసులకు తక్షణం సమాచారం అందించాలని డీఎస్పీ కోరారు. సమావేశంలో దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *