ఈనాడు పత్రికలో పాత ఫోటోలు పెట్టి తప్పుడు కథనాలు ప్రచురించిన రామోజీ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సా ర్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకట రెడ్డి, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎంపీపీ సుధా అచ్చయ్యలు డిమాండ్ చేశారు. ఈనాడులో తప్పుడు కథ నాలు ప్రచురించినందుకు నిరసనగా స్థానిక గడియారం స్తంభం సెంటర్ లో ఈనాడు పత్రి కను తగులబెట్టి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా నిజాన్ని చెప్పాల్సిన ఈనాడు పత్రికలో పాత ఫొటోలు పెట్టి పట్టాభిని కొట్టి నట్లు చూపించడం ఆ పత్రిక తప్పుడుదనాన్ని రుజువు చేసిందన్నారు. కార్యక్రమంలో ఎం పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలి మూటి దేవప్రసాద్, వైఎస్సార్ సీపీ నాయ
కులు మిల్లర్ బుజ్జి, వైఎస్సార్ సీపీ నాయ కులు పాల్గొన్నారు.

