వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా గాలిమూటి దేవ ప్రసాద్ నియమితులైన సందర్బంగా శుక్రవారం దర్శిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నవ్యాంద్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. దళిత ఉద్యమాలలో చురుగ్గా పనిచేసిన దేవ ప్రసాద్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఘనంగా షాలువాలు, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమం లో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నిపూడి ప్రేమ్ కుమార్, బిసి నాయకులు మరియు సహకార బ్యాంకు డైరెక్టర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, ఏఐటియుసి దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు, వైసీపీ నాయకులు యర్రగుంట్ల మోషే, పల్లె బాలయేసు తదితరులు ఉన్నారు
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా గాలిమూటి దేవ ప్రసాద్ కు దళిత ప్రజా సంఘాల అభినందన
24
Feb