భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా లబ్ధిదారులైన రైతుల తో సమావేశం నిర్వహణ

కిసాన్ సమ్మాన్ దివాస్ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నం శ్రీనివాస్ అధ్యక్షతన దర్శి అసెంబ్లీ పరిధిలోని తాళ్లూరు మండలము బొద్దుకూరపాడు గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా లబ్ధిదారులైన స్థానిక రైతులు తోటి సమావేశం ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు వారికి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగినది.. జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ .. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ దేశానికి వెన్నెముక రైతు ఆ రైతన్నను మోసం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని, ఎండనక వానక కష్టపడిన రైతు వరదలు వలన ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతే ఆ నష్టానికి నష్టపరిహారం చెల్లించలేని దౌర్భాగ్యం స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది అని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 12 విడతలలో 10.40 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు 2.16 లక్షల కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద రైతులకు నిధులు కేటాయించటం, 12వ విడతలో 8.42 కోట్ల లబ్ధిదారులైన రైతులకు 17 వేల కోట్లు కేటాయించడం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 39.87 లక్షల రైతులకు 800.30 కోట్ల నిధులు కేటాయించడం జరిగినదని అలాగే నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుల కోసం 20 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా అందించడం, రైతు సంక్షేమం కోసం 1.25 లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ , ఆహార ఎరువుల పెట్రోలియం సబ్సిడీ 5.25 లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ సహజ వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కోటి మందికి సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక నిధి ని కేటాయించిన నరేంద్ర మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి , జిల్లా కార్యదర్శి రాయపాటి అజయ్ కుమార్ , తాళ్లూరు మండల అధ్యక్షుడు అనుముల కోటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి , తాళ్లూరు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక రైతులు మరియు తదితరులు పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *