ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో సచివాలయ సిబ్బంది పాత్ర కీలకమని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు, స్థానిక మండల పరిషత్ సమావేశంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు. డిజిటల్ అసిస్టెంట్లు విలేజ్ పోలీస్. వెల్ఫేర్ అసిస్టెంట్ల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు, అందులో భాగంగా గ్రామ సమగ్రాభివృద్ధి పై సర్వే చేయాలని. ఆయుష్మాన్ భారత్ సర్వే చేయాలని. పాల వెల్లువ పై దృష్టి సారించి ఎక్కువ పాలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు, ఏపీ మీసేవ సర్వీసెస్ పెండింగ్ నగదును వసూలు చేయాలన్నారు, మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై నివేదిక తయారుచేసి సకాలంలో అంద చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు. సీనియర్ అసిస్టెంట్ ఎస్ సత్యనారాయణ. జూనియర్ అసిస్టెంట్ టీ కరుణాకర్. పంచాయతీ కార్యదర్శులు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

