మార్చి 14న జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం చేయాలని వైద్యాధికారిని వి జ్యోతి , వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. స్థానిక మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒంగోలు గైనకాలజిస్ట్ కే ప్రతిమ హాజరైనారు. ఈ సందర్భంగా ప్రతి స్కూలు మరియు అంగన్వాడీ కేంద్రం నందు నులిపురుగుల మాత్రలైనా ఆల్బెండజోల్ పంపిణీ చేయాలన్నారు. మార్చి 14న జరుగు జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని ప్రతి స్కూలు అంగన్వాడి కేంద్రంలో ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు మధ్యాహ్నం భోజనం అనంతరం ఆల్బెండజోల్ మాత్రలను చప్పరించే విధంగా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు, ఎంఈఓ జి చంద్రమోహన్, సి హెచ్ ఓ నారాయణరావు, హెచ్ వి కన్యాకుమారి, అంగనవాడి సూపర్వైజర్లు డి హేమలత, ఆర్ నాగమణి, ఆరోగ్య సిబ్బంది ప్రసాద్, యుగంధర్, నాగార్జున, ప్రభుదాస్, సురేంద్ర సాగర్, స్మైలీ, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
