తాళ్లూరు మండలం శివరామపురంమాజీ సర్పంచ్ నిశంకం సుబ్బులు (78) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆమె భర్త వెంకటేశ్వర్లు ప్రముఖ సిద్ధాంతి , గ్రామ నాయకుడు, ఆమె కుమారుడు వైసిపి నాయకులు హనుమంతరావు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ అభివృద్ధిలో ఆమె, వారి కుటుంబం ప్రముఖ పాత్రను పోషించారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు వారిని పరామర్శించారు. వైఎస్ఆర్సిపి తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర గురువారం ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాళ్లూరు మండల జడ్పిటిసి మారం వెంకట రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడమ కంటి వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఎడమ కంటి వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచులు షేక్ వలి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి లు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఆమె మరణం పార్టీకి తీరనిలోటని అన్నారు.


