మహిళా రైతులతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పిపిఎల్ కంపెనీ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ఎన్ డి రఫీ పేర్కొన్నారు, . గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో పి పి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ మహిళలు ఏ విషయంలోనూ తీసిపొరని, మహిళలు లేనిదే సమాజం లేదని అన్నారు. ఈ సదర్భంగా పిపిఎల్ కంపెనీ ప్రతినిధులు మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మహిళా రైతులను ఘనంగా సత్కరించారు. మహిళా రైతులకు బహుమతులను అందజేశారు. పిపిఎల్ కంపెనీ ఉత్పత్తులైన నవరత్న పవర్, కేమ్ ఫ్రీ, వ్యామాక్స్ , జిప్మైట్ ప్లస్, బయో-20
ప్రాధాన్యత అవసరాలను మహిళ రైతులకు తెలియజేశారు. పీపుల్ కంపెనీ ఉత్పత్తుల ద్వారా పంట దిగుబడుని ఏ విధంగా పెంచుకోవచ్చో మహిళా రైతులకు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సందర్భంగా గ్రామ సర్పంచి మరియమ్మ,
ఆదర్శ మహిళా రైతులని ఆర్.స్వర్ణకుమారి, కే రత్నకుమారి, సలర్ బి ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ఎన్ డి రఫీ,
మార్కెటింగ్ ఆఫీసర్
పి.వీ సుభాష్, జెకేఎస్ మల్లికార్జున, డి బి టి ఎస్ మల్లికార్జున, గ్రామ సర్పంచ్ మరియమ్మ,
చంద్ర ఎంటర్ప్రైజెస్ ప్రోప్రైటర్ ఆర్ రామారావు మరియు గ్రామంలోని మహిళా రైతుల పాల్గొన్నారు.

