తూర్పు రాయలసీమ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. మండలంలోని తూర్పు గంగవరం,రామభద్రాపురం, విఠలాపురం, రమణాల వారిపాలెం గ్రామాలలో గురువారం మండల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని ఓట్లను అభ్యర్థించారు.





