తూర్పు రాయలసీమ నుంచి పట్టభద్రులు స్థానానికి వైసీపీ బలపరిచినఅభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డిల కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జే సి ఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానంద రెడ్డి లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మండలంలోని శంకరాపురం, గంగన పాలెం గ్రామాలలో శుక్రవారం పట్టబద్దుల ఇంటింటికి తిరుగుతూ పట్టభద్రులను కలుస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పట్టభద్రుల ఇంటిదగ్గరకు వెళ్లి బ్యాలెట్ నమూనా పత్రాలు అందజేసి పట్టభద్రుల అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓటర్లు, నాయకులు పాల్గొన్నారు.
