ప్రకాశం జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గాలి మూటి దేవ ప్రసాద్ నూతనంగా నియమితులైన సందర్బంగా, దర్శి నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున దళిత నాయకులు, కార్యకర్తలు శుక్రవారం దర్శికి తరలి వచ్చి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఘన సన్మానం చేసారు . దళిత నాయకులు ఎమ్మెల్యే ని షాలువాల తో , పూల మాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దేవ ప్రసాద్ కి పదవి రావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వేణుగోపాల్ గారికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమం లో వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గాలిమూటి దేవ ప్రసాద్, నవ్యాంద్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద్ ప్రసాద్ మాదిగ, దర్శి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కేశనపల్లి నాగేశ్వరావు, కరుణానిది, దొనకొండ జేసియస్ కన్వీనర్ గుంటు పోలయ్య, దర్శి మండల వైసీపీ నాయకులు అచ్చయ్య, గర్నెపూడి రాజేష్, ముండ్లమూరు మండల వైసీపీ నాయకులు డగ్లస్, తప్పెట డేవిడ్, చందవరం మాజీ సర్పంచ్ నూనె రవి కుమార్, కురిచేడు వైసీపీ నాయకులు యర్రగుంట్ల మోషే, నాయకులు సొలొమోన్, పోలేపల్లి వైసీపీ నాయకులు గాలిమూటి కిరణ్ కుమార్, వర ప్రసాద్, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

