కురిచేడు మండలంలోని బోధనం పాడులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి, స్థానిక కోనవల్లభరాయ స్వామి కొండపై వేంచేసి ఉన్న గోపయ్య సమేత లక్ష్మీతిరుపతమ్మ తిరునాళ్లను శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి స్వామి వారులకు పొంగళ్లు నైవేద్యం చేసి సమర్పిం చారు. వీరాంజనేయస్వామికి అభిషే కం, ఆకుపూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త లక్కాకుల చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్ర వారం రాత్రికి సాంస్కృతిక కార్య క్రమాలు ఏర్పాటు చేశారు.
*ఆంజనేయస్వామికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి ప్రత్యేక పూజలు*
బోధనంపాడులో జరుగుతున్న ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల సంద ర్భంగా దర్శి శాసనసభ్యుడు డాక్టర్
మద్దిశెట్టి వేణుగోపాల్ స్వామి వారిని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గ్రామ నాయకులు, ఆలయ ధర్మకర్త లక్కాకుల చిన్న వెం కటేశ్వర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మా నించారు. వేమా చిన్న ఆంజనే యులు, ఆకుల కోటయ్య, వేమా శరత్. వేమా స్వాములు పాల్గొన్నారు.


