తూర్పు రాయలసీమ పట్టభద్రుల ,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యాం ప్రసాద్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ… ఉపాధ్యాయ , పట్టు బద్రుల ఓటర్లను పోలింగ్ కూడా వచ్చేలా అందరం చర్యలు చేపట్టాలని కోరారు, ఈ ఎన్నికలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గుర్తు చేశారు. గ్రామాల వారిగా ఓటర్ లిస్టు దగ్గర పెట్టుకొని ఓటర్లను ఎవరైనా ఇతర ప్రాంతాల్లో ఉండే వారికి ముందుగానే సమాచారం ఇచ్చి పోలింగ్ నాటికి స్వగ్రామాలకు పిలిపించాలని పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పారు. విశాఖపట్నం లో గ్లోబల్ సమిట్ ద్వారా ఆరు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని వివరించాలని కార్యక్రమంలో వైసిపి నాయకులు మద్దిశెట్టి రవేంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మండల కన్వీనర్లు,మండల సచివాలయ కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు ఎంపీటీసీ లు గ్రామ సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

