వైఎస్సార్సీపీ బలపరచిన గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్నాటి శ్యాం ప్రసాద్-రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, జెసీఎస్ కన్వినర్, సచివాలయ కన్వీనర్, వైఎస్సార్సీపీ నాయకులపై ఉందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శిలో ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర ఆధ్వర్యంలో మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి ప్రతి ఓటర్‌తో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమానికి మరింత చేయూత ఇవ్వాల్సిన ఆవశ్యకతను వివరించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు సుబ్బారావు, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, మాజీ సర్పంచి టీవీ సుబ్బా రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, పలు గ్రామాల సర్పంచిలు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


