ముండ్లమూరు మండలం లోని బృందావనం వద్ద గల అద్దంకి దర్శి రహదారి పక్కన గల చెరువును ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారని విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన కొందరు తహసిల్దార్ ఎస్ ఉషారాణికి శుక్రవారం అర్జీ అందజేశారు. వివరాల్లోకి వెళితే సర్వేనెంబర్ 59 లో చాపల చెరువు ఉంది. దానికి ఆనుకొని ఉన్న భూమి యజమానులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహిస్తూ వెంచర్లు వేస్తున్నారన్నారు. పట్టా భూములు సాకుతో చెరువు ఆక్రమించుకొని ఆర్ అండ్ బి రోడ్డుకు బాటా ఏర్పాటు చేసుకోకుండా, చెరువు భూమిలో బాటను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆక్రమణ గుర్తించి విచారణ చేపట్టి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు కాపాడి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు తహసిల్దార్ కు అర్జీ అందజేసిన వారిలో దాసరి ఏలియా, డి పిచ్చయ్య, పి గాలయ్య, కే కోటేశ్వరరావు, డి యాకోబు, ఏబు, జి పోలయ్య, డి నరేష్, డి ప్రసాద్, పి దావీదు, డి యోహాన్, ఎన్ ఏసు, డి కోటేశ్వరరావు, మరి కొంతమంది అర్జీ అందజేసిన వారిలో ఉన్నారు.
చెరువు ఆక్రమణ అరికట్టాలి
10
Mar