మత్తు పదార్థాలకు బానిస కావొద్దు – దర్శి సీఐ రామకోటయ్య

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని దర్శి సీఐ రామకోటయ్య సూచించారు. సంకల్పం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఝాన్సీ కళాశాలలో డ్రగ్స్, మత్తు పదార్థాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మలికాగర్గ్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శి సీఐ రామకోటయ్య మాట్లాడుతూ …విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే మత్తుకు బానిసలవుతున్నారని చెప్పారు. చెడు ఆలోచనలు మానుకుని క్రమశిక్షణతో మంచి నడవడికతో నడవాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాలకు బానిస వ్వమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐ రామకృష్ణ, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *