ఎమ్మెల్సీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిది- ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి బలపర్చి పోటీ చేస్తున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీ చేస్తున్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ల ను గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక గుంటక నాసరరెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం కార్యకర్తలు, గృహసారధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ .. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను చేపట్టిందని, ఆ ఫలితంగా ప్రతి ఎన్నికలలో పార్టీకి తిరుగులేకుండా అత్యద్భుతవిజయాలు దక్కాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సిపి బలపరిచి పోటీ చేస్తున్న అభ్యర్ధిని గెలుపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యేను స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేరువ సుబ్బారెడ్డి, స్టేట్ ఫిషరీస్ కోఆర్డినేర్ షేక్ సైదా, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు పెద్దయ్య, రాంబాబు, వెలిశెట్టి శ్రీనివాసులు, మేకల చౌడయ్య, గోపి, కండె గంగయ్య, మాజీ జడ్పీటీసీ వరికూటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *