lప్రకాశం జిల్లా దర్శి లోని వైఎస్ఆర్సిపి నాయకుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి కుమారుని వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై దీవెనల అందించారు. పొదిలి రోడ్డులోని బాలాజీ వెంచర్ ఆయన స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులైన గోపాల్ కృష్ణారెడ్డి, ప్రత్యూష వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మౌమిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాదం మాధవరెడ్డి, సీఎం వైఎస్ జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డి తదితరులు ఉన్నారు . అతిధులకు వైఎస్ఆర్సిపి శ్రేణులు భారీ స్వాగతం పలికారు.
