ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు.
దర్శి ప్రశాంత స్కూల్ లో శనివారం మండల స్థాయి కబడ్డీ పోటీలను ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటల పోటీలకు మంచి గుర్తింపు ఇచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అని అన్నారు. ప్రభుత్వ పరంగా పాఠశాల లో సౌకర్యాలు కల్పించి వారిని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలకు తర్ఫీదును ఇచ్చి పంపిస్తున్నారు అన్నారు. అదే విధంగా దర్శి లో క్రీడ సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.విద్యార్థులు గెలుపు ఓటముల తో సంబందం లేకుండా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ప్రశాంత స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర రెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ ఎం బాషా తదితరులు పాల్గొన్నారు.


