అకాల వర్షానికి విద్యుత్ పరికరాలు ధ్వంసం

ముండ్లమూరుమండలంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఉమామహేశ్వరపురం, ఈదర, శంకరాపురం, మారెళ్ళ, ముండ్లమూరు విద్యుత్తు సబ్స్టేషన్ పరిధిలో పలు గ్రామాలకు విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన విద్యుత్ ఏ ఇ జే, భూరాజు విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్దించి గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించారు. అక్కడక్కడ మూడు ఇన్సులేటర్లు కాలిపో యాయి. తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను అందించిన ఏ ఈ జె భూరాజును విద్యుత్ సిబ్బందిని పలు గ్రామాల ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో లైన్ మాన్ లో ఆంజనేయులు, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *