వైద్యశాల అభివృద్ధికి కావలసిన అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు ముండ్లమూరులో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సునీత బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 37 రకాల మందులు అందుబాటులో ఉంచడం జరిగింది అన్నారు. ఇటీవల కిడ్నీ, లివర్, పరీక్షకులకు సంబంధించిన ల్యాబ్ మంజూరు అయినందున అవసరమైన మేర పరీక్షలు నిర్వహించి ప్రజలకు సేవ లు అందించాలన్నారు. వైద్యశాల అభివృద్ధిలో భాగంగా రోగుల రాకపోకలకు వీలుగా రైలింగ్ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ముఖ ద్వారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సిబ్బంది తక్షణమే స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.24 గంటలు సిబ్బంది ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి వి జ్యోతి, డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి జడ్పిటిసి తాతపూడి మోజెస్ రత్నం రాజు, పాలె పోగు డగ్లస్ ,తదితరులు పాల్గొన్నారు.
వైద్యశాల అభివృద్ధికి చర్యలు వేగవంతం
ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి
18
Mar