మెరిట్ స్కాలర్షిప్ విద్యార్థులకుఅభినందనలు

ముండ్లమూరు లోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి ,పదవ తరగతి, ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 6 మందికి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ కు ఎంపికైన శరణ్య, కిషోర్, బాలకృష్ణ , వెంకట సూర్య, శ్రీ నందన్, విజయ నాయక్, విద్యార్థులను ప్రిన్సిపల్ కే పూర్ణచంద్రరావు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్న నాడే సమాజం గౌరవిస్తుందని, దీంతోపాటు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు వస్తుందన్నారు. స్కాలర్షిప్ కి ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి12500 లెక్కన ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాల పాటు స్కాలర్షిప్ వస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా, తులసి ,జానకి రామయ్య, సుజాత, సాధు వెంకటేశ్వర రెడ్డి, చాంద్ భాషా, అనురాధ, సుబ్బారావు, లక్ష్మీనారాయణ ,అశ్విని, రాఘవ, వెంకటేశ్వర్లు, హరిబాబు, గ్రేసీ, శివ నాగేశ్వరి, వేణుగోపాల్ ,నరసింహారావు, యమలేశ్వరా చారి, పిడి రాముడు, ఎలిసా, అంజిరెడ్డి, శ్రీను, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *