తాళ్లూరు కస్తూరిభా పాఠశాలలో నూతన విద్యాసంవత్సరంలో ఖాళీలను భర్తీచేయటానికి విద్యార్థునుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కెజిబి ప్రిన్సిపాల్ పి. సుజిత తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్మీడియట్ బైపీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విదార్థులు ఎప్రియల్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అనాథలు, బడి మానివేసిన పిల్లలు, బడి బయట పిల్లలు, పేద, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ, బిపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను ఫోన్ నంబర్ 9515838862, 95532263లను సంప్రదించాలని కోరారు.
కస్తూరిభాలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
29
Mar