మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి జీవనోపాధి పొం దుతూ లక్షాధికారులు కావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక వైఎస్సార్ క్రాంతి పథం కార్యాలయంలో బుధ వారం దొనకొండ, కురిచేడు మండలాలకు చెందిన వైఎస్సార్ ఆసరా చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. ఆడ పడుచులు తమ కాళ్లపై తాము నిలబడి చైతన్యం చెంది జీవనోపాధి సాగిస్తూ లక్షాధికారి కావాలన్నారు. మహిళలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. 11/04/2019 ఎన్ని కల తేదీ నాటికి డ్వాక్రా బ్యాంక్ లోన్ రుణమాఫీ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంత సొమ్ము నాలుగు విడతలుగా సుదీర్ఘ పాదయాత్రలో అక్కా చెల్లెలకు చెప్పిన మాట ప్రకారం 2 విడతలు పంపిణీ చేసి 3వ విడత నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ప్రతి మహిళా ఆసరా రుణమాఫీ తన జీవనోపాధికి ఉపయోగించుకుని అభివృద్ధి చెందా లన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆకాంక్షించారు. డీఆర్డీఏ వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ డి.బాబూరావు మాట్లాడారు. అనంతరం 3వ విడత వైఎస్సార్ రుణ మాఫీ దొనకొండలో 621 గ్రూపులకు రూ.4.04 కోట్లు, కురిచేడుకు రూ.625 గ్రూపులకు రూ.4.46 కోట్లు, స్త్రీనిధి దొనకొండ మండలం లో రూ.2.62 కోట్లు, కురిచేడు మండలంలో రూ.2.20 కోట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణు గోపాల్ నబీమహిళలు పూలమా లలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్రా యూనిట్, చేనేత వస్త్రాలు, చెప్పులు యూనిట్, పచ్చళ్లు యూనిట్ తదితర స్టాలున్న ఎమ్మెల్యే తిలకించారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం..
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ కేకు కట్ చేసి పంచి పెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, మహిళలు క్షీరాభిషేకం చేశారు. దొనకొండ, కురిచేడు ఎంపీపీలు బొరిగొర్ల ఉషామురళి, బెల్లం కోటేశ్వరమ్మ, జెడ్పీటీసీ మురికి పూడి సుధాకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి, మాజీ కన్వీనర్ కందుల నారపురెడ్డి, వైస్ ఎం పీపీలు వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిట్టా కోటిరెడ్డి, స్థానిక సర్పం చ్ కొంగలేటి గ్రేస్ కుమారి దేవానంద్, స్టేట్ గ్రీనరీ అండ్ బ్యూటీషియన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కురిచేడు మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, నక్కా రామకృష్ణ, భాస్కరరెడ్డి, గుంటు అజయ్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ గఫార్, సచివాలయం మండల కన్వీనర్ గుంటు పోలయ్య, తహసీల్దార్ కాలే వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వి.వ సంతరావునాయక్, దొనకొండ, కురిచేడు ఏపీఎంలు జి. వెంకటేశ్వర్లు సైమన్ లు పాల్గొన్నారు.









