విద్యార్థులు బాగా చదు వుకుని ఉన్నత శిఖరాలు అధి రోహించాలని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆకాంక్షిం చారు. దర్శి బాలికల ఉన్నత పాఠశాలలో వార్షికో త్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పాఠ శాల వార్షికోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయులు తెలిపారు.మ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ ….విద్యార్థుల భవిష్యత్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేశారన్నారు. ప్రతి విద్యార్థి గొప్ప గొప్ప చదువులు చద వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ముందుగా ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎంపీపీ సుధాఅచ్చయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫి కేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి పాల్గొన్నారు
సబ్సిడీ ట్రాక్టర్ అందజేత : ప్రసన్నాంజనేయ రైతు మిత్ర గ్రూప్ కు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సబ్సిడీ ట్రాక్టర్ బుధవారం అందజేశారు. సబ్సిడీ ట్రాక్టర్ ను నడిపి అందరినీ ఎమ్మెల్యే ఉత్సాహపరిచారు. రూ.8 లక్షల విలువైన ట్రాక్టర్ ను గ్రూప్ కన్వీనర్ లవనూరి శ్రీనివాసరెడ్డికి అందజేశారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





