బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో ఈసారి ఏప్రిల్ 3 నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) సీఈవో ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జిల్లాల పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు రావడం.. రెండో తేదీ ఆది వారం కావడం.. ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు కావడం వల్ల ఏప్రిల్లో చేపట్టే పింఛన్ల పంపిణీలో మార్పులు చేసినట్లు సెర్చ్ సీఈవో పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేసిన మొత్తాన్ని.. ఆ రోజు నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అందరికీ ఆదేశాలు జారీ చేయాలని పీడీలకు సూచించారు.
ఏప్రిల్ 3 నుంచి పింఛన్ల పంపిణీ -బ్యాంకులకు 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సెలవు.. 2వ తేదీ ఆదివారం- దీంతో 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సేర్ఫ్ ఆదేశం
30
Mar