పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేయడం లో కార్యదర్శులు అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని డీపీఓ జీవీ నారాయణరెడ్డి హెచ్చరించారు. దర్శి మండ లంలోని కొత్తపల్లి పంచాయతీలో ఎస్ డబ్ల్యూపీసీని ఆయన బుధవారం సందర్శించారు. అనంతరం దర్శి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. కొత్తపల్లిలో ఎస్ డబ్ల్యూపీసీకి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేట్ పెట్టాలని సూచించారు. రోజూ క్లాప్ మిత్రలు సేక రించిన చెత్తను ఎబ్ల్యూపీసీ వద్దకు చేర్చాలని సూచించారు. అక్కడ రెండో విడతలో తడి, పొడి, హానికర చెత్తలు వేరు చేసి తడి చెత్తతో వర్మి కంపోస్ట్ తయారీ చేపట్టాలని, తర్వాత అమ్మాలని ఆదేశించారు. షెడ్ చుట్టూ అల్లుకునే మొక్కలు నాటాలని, అప్పుడే వాతావరణం చల్లబడి వాన
పాములు చనిపోకుండా ఉంటాయని పేర్కొన్నారు. పారిశుధ్యంలో నిర్లక్ష్యంగా ఉన్న పంచాయతీ కార్య దర్శులకు మెమోలు జారీ చేశారు. మళ్లీ పునరావృ తం అయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. కనిగిరి డివిజనల్ పంచాయతీ అధికారి శోభ న్ బాబు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

