మారెళ్ళలో వడగండ్ల వాన

ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం అనుకోకుండా ఒక్కసారిగా మబ్బులు కమ్మి గాలి ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో పెద్ద పెద్ద వడగండ్లు పడడంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు వడగళ్ల వాన దాటికి బెంబేలెత్తారు. పొలాల్లో మిరప రైతుల కు ఇబ్బందికరంగా మారింది. పొలాల్లో ఎండబెట్టిన మిరపకాయలు కాపాడుకునేందుకు రైతులు పడరాని పాటుపడుతూ ఉరుకులు పరుగులతో మిరపకాయల కల్లాల వద్దకు వెళ్లి పరదా పట్టలు కప్పుకుని లోపే కొంతమేర తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో మార్కెట్లో సరైన ధర పలకదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *