గ్రామాల్లో జరుగుతున్న భూముల రీ సర్వేకు గ్రామాల్లో రైతులు సర్వే అధికారులకు సహకరించాలని ఒంగోలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలో గలతమ్మలూరు గ్రామంలో బుధవారం రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూములకు సంబంధించి రీ సర్వే చేసేందుకు మీ దగ్గర ఉన్న అన్ని రకాల రికార్డులు పాస్ పుస్తకాలతో గ్రామ సభకు వచ్చి తెలియజేయాలన్నారు. ధ్రువపత్రాలు పరిశీలించాకే మీకు సంబంధించిన భూములు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బంకా రమణమ్మ నాగిరెడ్డి, సర్పంచి గొర్రె శ్రీదేవి రాముడు, వీఆర్వో రవిశంకర్, సర్వేయర్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భూముల రి సర్వేకు సహకరించాలి
19
Apr