రైతులు రీ సర్వే పట్ల అవగాహన కలిగి ఉపయోగించుకోవాలని తహసీల్దార్ రామ్మోహన్ రావు అన్నారు. బొద్దికూరపాడు, శంకర నారాయణ పురం, శివరామపురం, దోసకాయలపాడు గ్రామాలలో రైతులకు రీ సర్వే పట్ల అవగాహన కల్పించారు. ఒంగోలు డిప్యూటీ ఇన్స్ఫెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు రెవిన్యూ అధికారులకు సహకరిస్తే సర్వే విజయవంతం అవుతుందని అన్నారు. రైతులకు చక్కగా సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు. తహసీల్దార్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రైతులు భూ హక్కులకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని, సంబంధిత విఆజ్ఞలకు సమర్పించాలని కోరారు. ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్, పాస్ పుక్ జిరాక్స్ కాపీలను అందించాలని కోరారు. ఆర్థో గూగుల్ మ్యాప్ (ఎజిపి)లను ప్రదర్శించారు. మాజీ సొసైటీ అధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ బాల కోటయ్య, దోసకాయలపాడు సర్పంచి కెఎస్ వెంకట రామిరెడ్డి, శివరామపురం మాజీ సర్పంచి హనుమంతరావు, సర్వేయర్ ఆవుల శ్రీనివాసరావు, విఆర్డీఓలు నాగేశ్వరరావు కోటేశ్వరరావు, చంద్రశేఖర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
