పాఠశాల పనితీరును ప్రణాళికాబద్ధంగా విశ్లేషించడానికి ఉపయోగపడే విధానమే పాఠశాల పనితీరు మూల్యాంకనం అని దర్శి మండల విద్యాశాఖాధికారి శ్రీ కాకర్ల రఘు రామయ్య పేర్కొన్నారు.స్కూల్ పెర్ఫార్మెన్స్ టూల్ పై జరిగిన ఒక్కరోజు శిక్షణాతరగతులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంవారు పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటే పాఠశాలలోని మౌళిక వసతులను,అవసరాలను యాప్ లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్స్ రవీంద్ర మరియు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏ శిక్షణాతరగతులను రిసోర్స్ పర్సన్స్ ఖాదర్ మస్తాన్, ప్రమోద్ కుమార్ నిర్వహించారు
దర్శి లో స్కూల్ పెర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ టూల్ పై శిక్షణ
25
Apr