తాళ్లూరు ప్రభుత్వ కళాశాలో 76శాతం ఉత్తీర్ణత

తాళ్లూరు వికే ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంవిద్యార్థులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

33 మందికి గాను 25 మంది ఉత్తీర్ణులు అయి 76శాతం సాధించినట్లు, ప్రధమ సంవత్సరం విద్యార్థులు 36 మందికి గాను 19 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ తారక్ నాథ్ తెలిపారు. సీఈసీలో ద్వితీయ సంవత్సరంలో కళాశాలలో ఎన్ రమ్య (937) సాధించి ప్రధమ స్థానంలో నిలువగా, బి. దీప్తి (888), లక్ష్మి కమారి (880)లు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలచారు. మొదటి సంవత్సరంలో క్రిష్ణ కాంతి (425), వైష్ణవి (408)లు ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఓకేషన్ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో పి అశ్విని (951), ఎం లావణ్య (926) అమూల్య (921) లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. ప్రధమ సంవత్సరంలో బుచ్చయ్య (488), నరసింహా (487)లు ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *