ప్రజా పక్షపాతి సీఎం జగనన్న – ప్రతి ఇంటికి సంక్షేమ లబ్ధి – గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి పట్టణంలో 4వ సచివాలయపరధిలో పుట్టబజారు. టెలిఫోన్ కార్యాలయం వెనక వైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నివాసానికి వెళ్లి ప్రభుత్వం నుండి అందిన లబ్ధిని వివరించారు. రాబోవు ఎన్నికలలో కూడ మంచిని చేసిన సీఎం వైఎస్ఆగన్మోహన్ రెడ్డిని దీవించి ఆశీర్వదించి రుణం తీర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వారికి అందిన లబ్దిని బ్రోచర్స్ను అందించారు. గతంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే అధికారులు, పాలకుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేదని నేడు జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉంటే నేరుగా లబ్ధి వారి నివాసాలకే అందుతున్న విధానాన్ని వివరించారు. అందుకు ప్రజలు కూడ జగనన్న ఎంతో మేలు చేసారని చెప్పారు.
దీర్ఘకాలిక సమస్య తీర్చాలని వినతి… తక్షణం స్పందించిన ఎమ్మెల్యే…. దర్శి పట్టణంలోని సర్వే నంబర్ 804లో 3.80 సెంట్లు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిగా నమోదు అయినదని నాటి నుండి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నివాసాలను అమ్ముకోవాలి అన్నా ఎదైనా రుణం తీసుకుని పిల్లల చదువులకు, పెళ్లిల్లకు ఉపయోగించుకోవాలన్న పడరాని పాట్లు పడుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టివేణుగోపాల్ ముందు వాపోయారు. తక్షణం స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్ శ్రవణ్కుమార్తో ఫోన్లో మాట్లాడి సమస్య గురించి వివరించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కార్యక్రమంలో ఎంపీపీ గోళ్లపాటి సుధా అచ్చయ్య, రాష్ట్ర గ్రీనింగ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం. అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, కౌల్సిలర్లు వీసీ రెడ్డి, మోహన్ బాబు, బాబు, నారాయణ రెడ్డి, దారం వాసుదేవ రెడ్డి, యర్రయ్య, కట్టెకోట హరీష్, అన్నవరపు రవి, శేషం రమణయ్య, కోటయ్య, ఎన్. శ్రీనివాస రెడ్డి, కిక్కి రమణా రెడ్డి, పాణేం రహమాన్ , అంబటి వెంకటేశ్వర రెడ్డి, మిల్లర్ బుజ్జి, జెసీఎస్ కన్వినర్ ఎదురు కోటిరెడ్డి, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి, అధికారులు మున్సిపల్ కమీషనర్ మురళి, డీఈ కరీం, ఎడీఈ పిచ్చయ్య, ఎఈ ప్రసాద్ హౌసింగ్ ఎఈ షాకీర్, విఆర్డీఓ మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *