ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని ఈవో పి ఆర్డి పి ఓబులేసు ఉన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో బుధవారం ఎంపీడీవో కే కుసుమ కుమారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామాలలోని ప్రతి ఇంటింటికి తిరిగి ఇంటి పన్నులు వసూలు చేసి గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలన్నారు. గ్రామంలో పరిశుద్ధ పై దృష్టి సారించి మురుగు నిలవ లేకుండా చేయాలన్నారు. గ్రాముల లో చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ కార్మికుల చేత పరిశుభ్రంగా చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రాధాకృష్ణ, రాజశేఖర్ రెడ్డి, మధు ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రాజరాజేశ్వరి, స్వర్ణలత, అంజమ్మ, వేణుగోపాల్, మౌలాలి, సమీర్ ,సుబ్బారెడ్డి, శ్రీనివాసరావు, బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు
సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి
26
Apr