గ్రామాల్లో జరుగుతున్న భూములరి సర్వే ను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్ అన్నారు. మండలంలోని ముండ్లమూరు, ఉమామహేశ్వరం పురం, బసవాపురం, గ్రామాల్లో జరుగుతున్న భూముల రి సర్వే ను బుధ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ డ్రోన్ కెమెరా ద్వారా తీసిన ఛాయాచిత్రాల ఆధారంగా, రైతుల వద్ద ఉన్న రెవెన్యూ రికార్డులు ఆధారంగా పరిశీలించి రైతులకు తెలియజేసి భూవివాదాలను సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఏమైనా తేడాలుంటే గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శివప్రసాద్, వీఆర్వోలు దయానందం, పెద్దన్న, మురళి, సర్వేయర్ కళ్యాణ్ ,రామకృష్ణ రైతులు బత్తిన సురేష్ బాబు, గుంటుపల్లి రంగనాయకులు , దోద్దాల రామయ్య పాల్గొన్నారు.
