దర్శి పట్టణంలో కురిచేడు మండలం నుండి బ్రతుకు దెరువు కోసం వచ్చి ఓ చిరు టిఫిన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి చెందిన ఇంటర్ మీడియట్ విద్యార్థి బుధవారం ఉరి వేసుకుని మృతి చెందినట్లు సమాచారం. విజయవాడలో ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న మానం దుర్గా ప్రసాద్ (17) బుధవారం సాయంత్రం ఫలితాలు రానున్న నేపథ్యంలో బలవర్మరణంకు పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాయం నెలకొన్నది. అయితే పట్టణంలో అద్దె నివాసం కావటంతో కురిచేడు మండలంలోని వెంగాయపాలెంకు మృత దేహాన్ని తరలించాడు. ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. గ్రామానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను సైతం మృతుని బంధువులు గ్రామానికి రానివ్వక పోవటంతో ఎటువంటి పూర్తి సమాచారం అందలేదు.
ఇంటర్ ద్వితీయ విద్యార్ధి మృతి
26
Apr