ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో దర్శి నందలి శ్రీ గౌతమీ జూనియర్ కళాశాల విజయ దుందుభి మోగించింది.ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఎం.పి.సి విభాగమనందు మిడుతూరి పవిత్ర 1000 మార్కులకు 991 మార్కులు సాధించి దర్శి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది.అదే విధంగా బై.పి.సి విభాగమనందు జి.నిఖిత 1000 మార్కులకు 980 మార్కులు సాధించి దర్శి పట్టణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎం.పి.సి విభాగమునందు గుంటి నతానియేలు 470 మార్కులకు 461 మార్కులతో దర్శి లో మొదటి స్థానాన్ని ,సానే సింధు శ్రీ 460 మార్కులతో రెండవ స్థానాన్ని సాధించారు.ఇంతటి ఘానా విజయాన్ని సాధించిన విద్యార్థులను శ్రీ గౌతమీ విద్య సంస్థల చైర్మన్ కనుమర్ల గుండా రెడ్డి ,ప్రిన్సిపాల్ నాగేంద్ర బాబు ,అధ్యాపకులు అభినందించారు .
సత్తా చాటిన శ్రీ గౌతమీ కళాశాల విద్యార్థులు
26
Apr