దర్శి పట్టణంలో గీతాంజలి జూనియర్ కళాశాల (ఎస్ పి) బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు సత్తా చాటి దర్శి టౌన్ ఫస్ట్ ర్యాంక్ సాధించిచారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎ యశశ్విని (989), వై ఉదయ లక్ష్మి (985) మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పి లక్ష్మి దేవ రాజు (464), సీహెచ్ జగదీష్ (463), వెంకటేశ్వర రెడ్డి (160), లక్ష్మి చైతన్య (460) మార్కులు సాధించి తమ ప్రతిభ చాటారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో దర్శి టౌన్ ఫస్ట్ సాధించిన విద్యార్థులు ఎ. యశశ్విని (989), పి. లక్ష్మి దేవరాజు (464) లను కళాశాల యాజమాన్యం కె ఆదినారాయణ, సుధాకర్ రెడ్డి, రవికాంత్ రెడ్డి , రమణా రెడ్డిలు అభినందించారు.
