ఇంటర్మీడియట్ – 2023 పరీక్షా ఫలితాలలో శ్రీ సరస్వతి కళాశాల విద్యార్ధినీ విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాలలో 470 మార్కులకు 466 మార్కులతో కె సాయికిరణ్, 465 మార్కులతో ఎన్ అక్షయ ఇంద్రసేనారెడ్డి నిలిచారు. 470కి 465 మార్కులపై ఇద్దరు, 464 మార్కులను 11 మంది విద్యార్థులు సాధించారు. 460 మార్కులను 53 మంది అందుకున్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాలలో 1000కి 987 మార్కులు ఒకరు, 986 మార్కులు ఇద్దరు శ్రీ సరస్వతి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలను సాధించిన విద్యార్ధినీ విద్యార్థులను శ్రీ సరస్వతీ విద్యాసంస్థల ఛైర్మన్, కరస్పాండెంట్ ఆవుల వెంకట రమణారెడ్డి అభినందించారు. విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. విద్యార్థులు, అధ్యాపకుల సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపక, అధ్యాపకే సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆవుల గణేష్ రెడ్డి, ఆవుల గంగాశంకర్ రెడ్డి, సిఇఒ సురేష్, డీన్లు, ప్రిన్సిపల్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి
27
Apr