రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న బుహక్కు కార్యక్రమంలో భాగంగా రీ సర్వే పూర్తి చేసుకున్న శంకరాపురం గ్రామంలో గురువారం రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ఎండి నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే దోహద పడిందన్నారు. మండలంలో మొట్టమొదటిగా రీ సర్వే పూర్తి చేసుకున్న శంకరాపురం గ్రామంలో రైతులకు నూతనంగా మంజూరైన భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సచివాలయం సందర్శించి, రికార్డులు పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవి కాంత్, వీఆర్వో బి అయ్యప్ప రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
