ముండ్లమూరు మండలంలోని పులిపాడు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు స్పందించారు . ఎస్సై సంపత్ కుమార్ ఆదేశానుసారం హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ (సూరి) , స్థానిక సర్పంచ్ ముక్కు మల్ల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన సర్పంచి ముక్కుమల్ల శ్రీనివాసరెడ్డి అండర్ బ్రిడ్జి వద్ద మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతంలో మట్టితోలించి గుంతలు పూడ్చారు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతో సర్పంచ్ శ్రీనివాసరెడ్డిని ఎస్సై సంపత్ కుమార్ ను వాహనదారులు , ప్రజలు అభినందించారు.
