ముండ్లమూరులో పారిశుధ్య పనులు

ముండ్లమూరు( మండల కేంద్రమైన ముండ్లమూరులో గురువారం పంచాయతీ కార్యదర్శి ఇ డమ కంటి రాజశేఖర్ రెడ్డి గురువారం పారిశుద్ధ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా దర్శి అద్దంకి ప్రధాన రహదారి వెంబడి తమ్మలూరు వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ముళ్ళ చెట్లను తొలగించారు. ఆ రహదారిలో ప్రయాణికులు వేచి ఉన్న సమయంలో మురుగు వాసనతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. అక్కడ ఉన్న దుకాణ దారుల వ్యాపారులు చెత్తను ఆ ప్రాంతంలో వేయడం వలన పరిసర ప్రాంత గృహాల వారు దోమలతో మురుగువాసనతో ఇబ్బందికరంగా మారింది. దీంతో స్పందించిన పంచాయతీ కార్యదర్శి జెసిబి ద్వారా శుభ్రం చేయించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *