గ్రామాలలో జరుగుతున్న రీ సర్వేలో, అసైన్మెంట్ కమిటీలో రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా రెవిన్యూ అధికారులు కృషి చెయ్యాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కోరారు. స్థానిక ఎంపీపీ ఛాంబర్లో రెవిన్యూ సమస్యలపై తహసీల్దార్ రామ్మోహన్రావు సమక్షంలో గ్రామ రెవిన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, ‘జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రెవిన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమయం వృథా కాకుండా రైతులకు వారి వచ్చిన పని ఖచ్చితంగా అవుతుందా లేదా అన్న విషయాలను తెలిపి అందుకు పరిష్కారం మార్గం చూపించాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియేల్ రాజు, విఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం జరిగేలా చూడాలి – ఎంపీపీ తాటికొండ
27
Apr