దర్శి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న ప్రచార భేరిని విజయవంతం చెయ్యాలని వామపక్షాల నాయకులు, కార్యకర్తలు గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. శుక్రవారం నిర్వహించనున్న బహిరంగ సభలో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జీవీ కొండా రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్ నారాయణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులతో పాటు పలువురు ప్రముఖలు పాల్గొంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు, హనుమంతరావు, కరుణా నిధి, సీపీఎం నాయకులు తాండవ రంగారావు, సందు వెంకటేశ్వరరావు, ఉప్పు నారాయణ | తదితరులు పాల్గొన్నారు.
వామ పక్షాల ఆధ్వర్యంలో ప్రచార భేరిని విజయవంతం చెయ్యండి.
27
Apr