డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏ‌సి‌బి యాప్ కి వచ్చిన ఫిర్యాదులపై రెండు రోజుల పాటు(26-04-2023, 27-04-2023)రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్టర్ మరియు తహశీల్దార్ కార్యాలయల పై తనిఖీలు

డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏసీబీ 14400 కాల్ సెంటర్, ఏ‌సి‌బి యాప్ కి వచ్చిన ఫిర్యాదులపై రెండు రోజుల పాటు(26-04-2023, 27-04-2023)రాష్ట్ర వ్యాప్తంగా సబ్-రిజిస్టర్ మరియు తహశీల్దార్ కార్యాలయల పై ముపైకి పైగా ఏసీబీ అధికారుల బృందాలు 7 సబ్-రిజిస్టర్ కార్యాలయాలలు, 2 MRO కార్యాలయాల పైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సుమారు 1,09,28,000 అనధికార నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించిన కార్యాలయాలు, స్వాధీనం చేసుకున్న నగదు, కేసుల వివరాలు;-

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
  1. బద్వేల్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు, కడప లో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి నుండి సుమారు 2,70,000, డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి సుమారు సుమారు 2,10,000 రూపాయలను జప్తు చేయడం జరిగింది. విరిపైన pc act SECTION-7 కింద కేసు నమోదు చేయడం జరిగింది.
  2. అనంతపురం రూరల్ SRO లో జరిపిన తనిఖీలలో డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుండి సబ్-రిజిస్ట్రార్ కు డ్రైవరుగా(ప్రైవేట్) పనిచేస్తున్న ఎస్‌కే. ఇస్మాయిల్ వసూలు చేసిన 2,00,000పైగా నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది.
  3. కందుకూరు SRO, నెల్లూరులో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ చాంబర్ నుండి సుమారు 41,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుండి సుమారు 94,000 రూపాయల అదే విధంగా వన్నం సతీష్ అనే డాక్యుమెంట్ రైటర్ నుండి సబ్-రిజిస్ట్రార్ కు ఆరు నెలల వ్యవధిలో phone-pay ద్వారా సుమారు 2,36,000 పంపించినట్లు, అంతే కాకుండా సబ్-రిజిస్ట్రార్ అటెండర్ ఫయాజ్ కు phonePe ద్వారా 1,20,000 పంపినట్లు గుర్తించడం జరిగింది.

4 తిరుపతి రూరల్ SRO, తిరుపతి లో జరిపిన తనిఖీలలో డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి 90,000, కార్యాలయం లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల నుండి 56,000, జూనియర్ అసిస్టెంట్ నుండి 9,000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

  1. నర్సాపురం SRO, ఏలూరు లో జరిపిన తనిఖీలలో సబ్-రిజిస్ట్రార్ చాంబర్ నుండి 30,000 రూపాయలు, పలువురు డాక్యుమెంట్ రైటర్ల నుండి సుమారు 20,000, ప్రైవేట్ వ్యక్తి నుండి 6,000, సీనియర్ అసిస్టెంట్ నుండి 9,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
  2. జగదాంబ SRO, విశాఖపట్నం లో సబ్-రిజిస్ట్రార్, జాయింట్ సబ్-రిజిస్ట్రార్ ఇద్దరు విధులు నిర్వహిస్తుండగా ప్రైవేట్ వ్యక్తి నుండి phonePe ద్వారా మూడు విడుతలుగా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కు 90,000 పంపించినట్లు గుర్తించడం జరిగింది. అదే విధంగా పదమూడు మంది డాక్యుమెంట్ రైటర్ల నుండి 39,000 రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు.
  3. తుని SRO, కాకినాడ జిల్లా లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్ వద్ద నుండి 20,000, లెక్కలకురాని మరో 20,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
  4. మేడికొండూరు MRO ఆఫీసు, గుంటూరులో ఎం‌ఆర్‌ఓ కార్యాలయంలో జరిపిన తనిఖీలలో 1,04,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
  5. జలమూర్ MRO ఆఫీసు, శ్రీకాకుళo తో జరిపిన తనిఖిలలో తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ అధికారి నుండి సుమారుగా 27,500 స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఈ సంధర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్నా నగదు పైన సంబంధిత అధికారులు, వ్యక్తులు ఇచ్చిన వివరణలో కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం సబ్-రిజిస్టర్ల, ఇతరులపైన PC ACT సెక్షన్ 7 కింద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇద్దరు MROల పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సిఫార్సు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా అధికారులు అవినీతికరమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ప్రజలు ఫిర్యాదు కోసం 14400

అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *