ప్రభుత్వ పారదర్శకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలో 4వ సచివాలయపరధిలో ముస్లీం వీధులలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ ఎంతో ఆసరాగా నిలుస్తుందని లబ్ధిదారులు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయనను ప్రతి లబ్దిదారులు దీవించాలని చెప్పారు. ముస్లీం కాలనీలో ఉన్న నీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి అందిస్తున్నామని, ప్రస్తుతం ఎమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముందుగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, కార్యదర్శి గోను నారాయణ రెడ్డి, కౌల్సిలర్లు వీసీ రెడ్డి, మేడగం మోహన్ రెడ్డి మోహన్ బాబు, బాబు, నారాయణ రెడ్డి, ముత్తినీటి సాంబయ్య యర్రయ్య, కట్టెకోట హరీష్, శేషం రమణ య్య, ఎన్. శ్రీనివాస రెడ్డి, కిక్కి రమణా రెడ్డి, మిల్లర్ బుజ్జి, పాశం జయసింహా, గురవయ్య, కాలేషా వలి, బాజి షరీఫ్, ఆరేటి శ్రీను, సురేష్, జెసీఎస్ కన్వినర్ ఎదురు కోటిరెడ్డి, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి, అధికారులు మున్సిపల్ కమీషనర్ మహేష్ , డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవి, ఎఈ ప్రసాద్ హౌసింగ్ ఎఈ షాకీర్, విఆర్డీఓ మురళి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



