నగర పంచాయితీ సమావేశం శుక్రవారం చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య అధ్యక్షతననిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కౌన్సిలర్ వీసీ రెడ్డి పట్టణంలోని ఆక్రమణలు కొంత బాగం తొలగించారని మిగిలిన వాటిని కూడ తొలగించాల్సిన ఆవశ్యకతను సభ దృష్టికి తీసుకువచ్చారు. చింతల పాలెం చేపల చెరువు వేలం పాట నగదు రికవరీ విషయమై చర్చించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని రికవరీ చేయనున్నట్లు కమీషనర్ మహేశ్వరరావు సభ్యులకు తెలిపారు. పలు తీర్మాణాలు ఆమోదించారు. కార్యక్రమంలో వైఎస్ చైర్మన్లు స్టీవెన్, తలారి కోటయ్య, కమీషన్ నర్ పై మహేశ్వరరావు, కౌల్సిలర్లు మేడగం మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి శివా రెడ్డి, పెద్దిరెడ్డి నారాయణ రెడ్డి, మోహన్ బాబు, బాబు, తదితరులు
పాల్గొన్నారు.
దర్శి నగర పంచాయితీ సమావేశం నిర్వహణ
28
Apr