దర్శి మండలం రాజంపల్లి సర్వే నంబర్ 1071లో గత ఐదు దశాబ్ధాలుగా యానాదులు సాగు చేసుకుంటున్న రెండు ఎకరాలను కొందరు ఆక్రమణదారులు ఆక్రమణకు పూనుకున్నారని రక్షించాలని తహసీల్దార్ కు శుక్రవారం దళిత, ప్రజా పరిరక్షణ సమితి నాయకులు వినతి పత్రం అందించారు. ముందుగా ఆయా కుటుంబాలతో కలసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు పొట్లూరి లక్ష్మయ్య, గిరిజన పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రావూరు శ్రీనివాసరావు, రాష్ట్ర దళిత సేన, ప్రధాన కార్యదర్శి ప్రేమక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యానాదుల భూమిని పరిరక్షించాలని వినతి
28
Apr